
చెన్నై న్యూస్: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. విజయం సాధించిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తిగా ప్రకటించింది.
ఈ ఫలితాల ప్రకారం, 2026 శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK) 108 నియోజకవర్గాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారంలో ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) ఇప్పుడు ప్రతిపక్ష స్థాయికి చేరింది.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో TVK అభ్యర్థి చేతిలో ఓటమి పాలవడం సంచలనంగా మారింది. అదే నియోజకవర్గంలో అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం
(AIADMK) మూడో స్థానంలో నిలిచింది.
పార్టీలు గెలిచిన స్థానాలు:
TVK – 108 స్థానాలు
DMK కూటమి – 73 స్థానాలు
AIADMK కూటమి – 53 స్థానాలు
NTK – 0 స్థానాలు
DMK కూటమి వివరాలు:
DMK – 59
కాంగ్రెస్ – 5
VCK – 2
DMDK – 1
కమ్యూనిస్టు పార్టీలు – ఒక్కొక్కటి 1 స్థానం
AIADMK కూటమి వివరాలు:
AIADMK – 47
PMK – 4
BJP – 1
AMMK – 1
ఓట్ల శాతం:
TVK – 34.92%
DMK – 24.19%
AIADMK – 21.21%
మొత్తం ఓట్లు:
TVK – 1,72,26,209 ఓట్లు
DMK – 58,95,000 ఓట్లు
AIADMK – 1,04,62,146 ఓట్లు
ఈ ఎన్నికల ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పుకు నాంది పలికాయి. TVK స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, DMK ప్రతిపక్ష పాత్రను పోషించనుంది.
…………..