వాల్మీకి మహర్షి బహుజనులు అందరికీ ఆదర్శప్రాయుడు :ద్రావిడ దేశం కృష్ణారావు

ఒంగోలు న్యూస్: ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా జరిగాయి. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు అధ్యక్షుడు వహించగా ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా , ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు కార్పొరేషన్ మేయర్ జి.సుజాత, ద్రావిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంకా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. కృష్ణారావు ప్రసంగిస్తూ సంస్కృత భాషకు ఆదికవి, రామాయణం అందరికీ అర్థమయ్యేలా వ్రాసిన మహర్షి వాల్మీకి బహుజనులందరికీ ఆదర్శప్రాయుడు అని అన్నారు. ఒక వేటగాడుగా జీవితాన్ని ప్రారంభించి నారద మహర్షి సందేశం ద్వారా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని నిరూపించిన గొప్ప మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం అని కృష్ణారావు అన్నారు .

ఇటీవల పొన్నలూరు మండలానికి చెందిన, పదవ తరగతి చదువుతున్న మైధిలి అనే ఒక బీసీ విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా బాధ్యతలు వహించిన నలుగురు ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అంసారియా సస్పెండ్ చేసి బీసీలకు ధైర్యం ఇచ్చారని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో బిసి లకు భరోసానిచ్చే విధంగా చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
……………….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి