జననాయకన్’ వాయిదాపై నిర్మాత క్షమాపణ

చెన్నై న్యూస్:ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదల కావాల్సిన హెచ్. వినోద్ దర్శకత్వంలోని, విజయ్ నటించిన ‘జననాయకన్’ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ జారీ ఆలస్యం కారణంగా విడుదల కాకపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర వాయిదాపై వివరణ ఇస్తూ నిర్మాత వెంకట్ నారాయణ క్షమాపణలు తెలిపారు.
‘జననాయకన్’ నిర్మాణ సంస్థ అధినేత వెంకట్ నారాయణ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ—డిసెంబర్ నెలలోనే సినిమాను సెన్సార్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. బోర్డు సూచించిన మార్పులన్నీ చేసి మళ్లీ సమర్పించామని చెప్పారు.
U/A సర్టిఫికేట్ వస్తుందని ఆశించిన సమయంలో, జనవరి 5వ తేదీ సాయంత్రం సినిమాను రివ్యూ కమిటీకి పంపనున్నారనే సమాచారం తమకు షాక్‌కు గురిచేసిందన్నారు. ఫిర్యాదు ఎవరు చేశారో తెలియకపోవడం, సమీక్షకు తగిన సమయం లేకపోవడంతో వెంటనే కోర్టును ఆశ్రయించామని తెలిపారు.
కోర్టు సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించినప్పటికీ, సెన్సార్ బోర్డు అప్పీల్‌కు వెళ్లి మధ్యంతర స్టే పొందినట్లు వెంకట్ నారాయణ వివరించారు. ఈ కారణంగానే సినిమా విడుదల వాయిదా పడిందని స్పష్టం చేశారు.
ఈ అనూహ్య పరిస్థితుల వల్ల అభిమానులు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఎదుర్కొన్న అసౌకర్యానికి ఆయన వినయపూర్వకంగా క్షమాపణలు కోరారు.
……….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు
dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి