ఘనంగా ‘తెలుగు బ్రాహ్మణ మహాసభ ఉగాది ఉత్సవం’

విళ్లివాకం న్యూస్ : తెలుగు బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక, శ్రీ త్యాగరాజ దినోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై టి.నగర్ లో గల శ్రీ శారదా విద్యాలయా ప్రాంగణంలో లోని శారద శ్రైన్ వేదికయింది. ముందుగా గణపతి పూజ జరిగింది. తెలుగు బ్రాహ్మణ సభ అధ్యక్షులు గోటేటి వెంకటేశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ జాయింట్ కమీషనర్ మంగపతి వివేకానందన్ విచ్చేశారు. బ్రహ్మశ్రీ దర్బాకుల కుమారశర్మ, పరేశ్ బాబా, త్రికూటం సత్యమూర్తి, డాక్టర్ వెంకట నాగరాజన్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. చిన్నారుల భరతనాట్యం అలరించింది. కార్యక్రమంలో ఫణిశర్మ పంచాంగ శ్రవణం జరిగింది.
తెలుగు బ్రాహ్మణ సభ నిర్వాహకులు ఎస్ జయరామన్, టి.శంకర్, ఎల్ సాయినాధ్, పిఎల్ఎన్ రఘుకుమార్ ప్రభాకర్, బాలాజీ, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి