మహిళల లైంగిక కోరికలు తీర్చే రోబోలు … 2025 నాటికి జరిగేదిదేనట!!!

తెలుగు న్యూస్ టైమ్స్ :సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చింది. అయితే ఈ టెకీ జమానాలో మానవ సంబంధాలు కూడా మారిపోయే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా లైంగిక సంబంధాల్లో కూడా టెక్నాలజీ ఎంటర్ కానుందని అంటున్నారు.రాబోయే కాలంలో మానవ సంబంధాలు కొత్తపుంతలు తొక్కనున్నాయని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇలాంటి ఆసక్తికర కథనాన్నే బ్రిటిష్ వార్తాసంస్థ ది సన్ వెల్లడించింది. 2025 నాటికి రొబోటిక్ సెక్స్ ధనవంతుల మహిళలకు బాగా దగ్గర కానుందని తెలిపింది. ఇలా పురుషులతో కాకుండా రోబోట్స్ తో లైంగిక కోరికలు తీర్చుకునే సంస్కృతి రాబోయే పదేళ్లలో మరింత పెరిగిపోతుందని ఫ్యుటురోలజిస్ట్ డా. ఇయాన్ పియర్సన్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే మహిళలు పురుషుల కంటే రోబోలనే ఎక్కువగా ఇష్టపడే సంస్కృతి మొదలయ్యిందని డా. ఇయాన్ వెల్లడించారు. అయితే ఈ వాదనతో ఎక్కువమంది ఏకీభవించకపోవచ్చు. కానీ ప్రస్తుతం సెక్స్ టాయ్స్ వంటి వాటికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోలు కూడా ఇందులో భాగం అవుతాయనే మరో వాదన కూడా వుంది. మొత్తంగా లైంగిక వ్యవహారాల్లో రోబోల ఎంట్రీ పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.

డా. పియర్సన్ అభిప్రాయం ప్రకారం… ఒకప్పుడు లైంగిక విషయాల గురించి మాట్లాడేవారు కాదు. కానీ నేడు ఆ విషయాల గురించి చాలా సహజంగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో లైంగిక సంబంధమైన టాయ్స్, వైబ్రేటర్లు విరివిగా వినియోగంలో వచ్చాయని తెలిపారు. కాబట్టి భవిష్యత్ లో లైంగిక వ్యవహారాల కోసం రోబోలను ఉపయోగించడం కూడా సర్వసాధారణం కానుందని తెలిపారు.

2050 నాటికి సాధారణంగా లైంగిక కోరిక తీర్చుకోవడం కంటే రోబోలను ఉపయోగించడానికే ఎక్కువమంది ఇష్టపడతారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం లైంగిక కోరికల కోసం రోబోల వినియోగించడం ఊహించడానికి వింతగా వుంది… కానీ ఇదే పోనుపోను సాధారణంగా మారుతుందని డా. పియర్సన్ తో పాటు ఇతర నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలా లైంగిక వ్యవహారాల్లో రోబోల వినియోగం పెరిగితే వాటితో ఎమోషనల్ బాండ్ కూడా పెరిగే అవకాశాలున్నాయి… తద్వారా సిగ్గు, బిడియం తగ్గి చాలా కామన్ గా లైంగిక కోరికలు తీర్చుకునే పరిస్థితి వుంటుందన్నారు.

(ఈ వార్త సామాజిక మాధ్యమాల ద్వారా స్వీకరించినది మాత్రమే గమనించగలరు)

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి