షుగర్ కంట్రోల్‌కు ఎరుపు అరటి!”

చెన్నై న్యూస్:అరటి పండ్లు ఏ సీజన్‌కైనా లభించే ఆరోగ్య ప్రదాతలు. పసుపు రంగులో కనిపించే సాధారణ అరటులతో పాటు ఎరుపు రంగు అరటి పండ్లు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఈ ఎరుపు అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

రోగ నిరోధక శక్తికి బలం:
ఎరుపు అరటిలో కెరోటినాయిడ్స్, ఆంథోసయనిన్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

కంటి ఆరోగ్యానికి దీవెన:
ఈ అరటిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్-ఎగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్-కె ఎముకల బలానికి తోడ్పడుతుంది. గాయాల వేళ రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది.

బరువు తగ్గాలంటే..
విటమిన్ బి6 మెటబాలిజాన్ని మెరుగుపరచి శరీరంలోని కొవ్వు కాల్చేందుకు సహాయపడుతుంది. విటమిన్ సి వల్ల శరీరం యాంటీ ఆక్సిడెంట్ గుణాలను పొందుతుంది.

డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫలితం:
ఈ అరటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించగలదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని భయపడకుండా తినవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేసి మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

మొత్తంగా – శక్తికి, ఆరోగ్యానికి, డయాబెటిస్‌ నియంత్రణకు ఎరుపు అరటి పండ్లు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి