మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజేత!

చెన్నై న్యూస్: భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది! వన్డే క్రికెట్‌లో తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుని, దేశాన్ని గర్వపడేలా చేసింది.

ముంబైలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. జవాబులో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆమె తన స్పిన్ మాయతో 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసి బౌలింగ్‌లో మెరిపించగా, శ్రీ చరణి ఒక వికెట్ సాధించింది.

బ్యాటింగ్‌లో కూడా షెఫాలీ వర్మ సత్తా చాటింది. కేవలం 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీ సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన 45 పరుగులతో సహకరించింది.

47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో ఇదే భారత జట్టు తొలి వరల్డ్ కప్ విజయం. 2005, 2017 ఫైనల్స్‌లో ఓటమి చవిచూసిన భారత్‌, ఈసారి ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచి తన కలను నిజం చేసుకుంది.

 

టీమిండియా మహిళల ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాలు రేపుతోంది. క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, రాజకీయ నాయకులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
……………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి