అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పై కృతజ్ఞతలు

చెన్నై న్యూస్:ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ధర్నా చౌక్ వద్ద గతంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విగ్రహ స్థాపన డిమాండ్ కూడా ఒక ముఖ్య అంశంగా ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో ఉంచిన ఇతర సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని పేర్కొన్నారు.
అమరావతిలో 58 అడుగుల ఎత్తులో “స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్”గా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు నిజమైన నివాళిగా అభివర్ణించారు. తెలుగు ప్రజల హక్కుల సాధన కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి