కెసిఆర్‌ హయాంలో ఆర్థిక విధ్వంసం

ఏడు లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టిన ఘనుడు

అరచాక పాలన సాగించిన కెసిఆర్‌: పొంగులేటి

కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీ అని చెప్పి బీఆర్‌ఎస్‌ గా పేరు మార్చి పక్క రాష్టాల్రతో గొడవలు పెట్టుకున్నారన్నారు. ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని, ఏడు లక్షల కోట్ల అప్పుల్లో రాష్టాన్న్రి ముంచారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలను కేసీఆర్‌ పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఫోన్‌ ట్యాపింగ్‌ తో పాటు ఇరిగేషన్‌, విద్యుత్‌ సంస్థల్లో కేసీఆర్‌ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులకు వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ త్వరలోనే పేకమేడ లాగా కూలిపోతుందన్నారు. రైతుబంధు నిధులను రుణమాఫీ కోసం వాడామని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతు భరోసా రైతులకు ఇచ్చి తీరుతామని చెప్పారు. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్‌ లాగా రుణమాఫీకి పదేళ్ల సమయం తీసుకోలేదని.. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని తెలిపారు. వాస్తవాలను బిఆర్‌ఎస్‌ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ నాయకుల మాదిరి గొప్పలకు వెళ్లడం లేదని ఉద్ఘాటించారు.బీఆర్‌ఎస్‌ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్‌ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు. ఫోన్‌ ట్యాప్‌, ఇరిగేషన్‌, కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రైతులను ఆందోళనకు గురిచేసేలా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుటుంబ నిర్దారణకు మాత్రమే రేషన్‌ కార్డు ప్రమాణికమని తెలిపారు. రేషన్‌ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్‌ కార్డు పేరుతో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని అన్నారు. కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని హావిూ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ, రేషన్‌ కార్డులు వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. ఒకదానితో ఒకటి లింక్‌ పెట్టబోమని అన్నారు. కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తాము రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు.కేసీఆర్‌ చేసింది పదేళల్లో 25 వేల కోట్ల రుణమాఫీ మాత్రమేనని అన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి