కొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం

ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కొండగట్టు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. 

కొండగట్టుకు చేరుకునే మార్గం మధ్యలో పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కు స్వాగతం పలికారు.కొత్తపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు. పవన్ టూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ముడుపులు కట్టిన పవన్, ఇవాళ ముక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు పవన్.

Spread the love

One Response

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి