ఘనంగా ఉపాసన తొలి పుట్టినరోజు వేడుకలు

టి నగర్ న్యూస్ :చెన్నై త్యాగరాయ నగర్ పరిధిలోని కన్నంపేటకు చెందిన వి. సతీష్ కుమార్ – నిత్య దంపతుల ముద్దుల కుమార్తె వి. ఉపాసన తొలి జన్మదిన వేడుకలు శుక్రవారం సాయంత్రం అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు.
స్థానిక అతిధి మినీ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారి ఉపాసనతో కేక్ కట్ చేయించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చారు.

ఈ ఆనందకరమైన కార్యక్రమానికి టీ నగర్ ఎమ్మెల్యే జె. కరుణానిధి, సీనియర్ న్యాయవాది ఎం. శ్రీధర్, పి. పాల్ కొండయ్య, వి. మంగళలక్ష్మి, జి. యంగయ్య, జి. జయమ్మతో పాటు పలువురు ప్రముఖులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
పసిడి చిరునవ్వులతో ఉపాసన అందరి మనసులు దోచుకోగా, ఈ వేడుక కుటుంబ సభ్యులకు మధుర జ్ఞాపకంగా నిలిచింది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి