ఘనంగా వి.జి.ఎన్ ఫెర్మాంట్‌లో ఉగాది వేడుకలు

చెన్నై న్యూస్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం చెన్నై సమీపంలోని గిండీ విజిఎన్ ఫెర్మాంట్ అపార్ట్మెంట్స్ లో నివాసముంటున్న తెలుగు, కన్నడ, ప్రజలు ఉగాది పండుగను సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, పురోహితులు గోసు ప్రకాశం ప్రత్యేక గణపతి, అలివేలు మంగ సమేత, ప్రసన్న వెంకటేశ్వర స్వామి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేశారు. అలాగే గోసు ప్రకాశం గారు రచించిన మన పురాణాలు పుస్తకం రెండవ ముద్రణను ఆవిష్కరించి తెలుగు ప్రజలకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి, నృత్యాలు ప్రేక్షకులందరికీ అలరించాయి. దేశంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలా చూడాలంటూ ప్రత్యేక పూజలు చేసి ఈ పూజలో పాల్గొన్న అందరికీ ఉగాది పచ్చడిని పంపిణీ చేసి, విందు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ట్రెజరర్ నగేష్, రఘునాథ్, చిట్టాల మోహన్ కుమార్, పి. రవికుమార్, మూర్తి, వి సుబిత, చిత్ర, నీరజ, కె దివ్య, శోభారాణి, సుధా పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తెలుగు కన్నడ ప్రజలు పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి