శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం

చెన్నై :శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో 37వ సంవత్సర శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. చెన్నై కొరట్టూర్ అగ్రహారంలోని రామాలయం వీధిలో ఉన్న శ్రీ కోదండరామాలయం ప్రాంగణంలోని హాలు వేదికైంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జె ఎం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు జరిగాయి.

ముందుగా శ్రీ కోదండ రామాలయంలో సీతారాములకు విశేష పూజలను నిర్వహించారు అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను ఊరేగింపుగా, మంగళ వాయిద్యాలు నడుమ వేదికపైకి తీసుకొని వచ్చారు.శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామివార్లను విశేషంగా అలంకరించి కల్యాణ తంతును పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి ప్రారంభించారు. ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు సాగింది.

ఏడు జంటలు పెళ్లి పెద్దలుగా కూర్చొని సీతారాముల కల్యాణాన్ని జరిపించారు మాంగల్య ధారణ చేసి శ్రీరామ నామ స్మరణ నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు 1200 మందికి పైగా భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు ఈ వేడుకల్లో అన్నా నగర్ ఎమ్మెల్యే మోహన్ పాల్గొని సీతారామ కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు వడపప్పు పానకం లను అందజేశారు.

ఈ వేడుకల్లో స్రవంతి ప్రధాన సెక్రటరీ జె. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్ , కేఎన్ సురేష్ బాబు సరస్వతి కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సాయంత్రం
శ్రీ రామ భక్తి సంకీర్తనం కార్యక్రమం, రామ నాట్యామృతం కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


……….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి