కాంగ్రెస్‌ కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ట్వీట్‌

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్‌ ఆ పార్టీకి ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఆ పార్టీ సర్కారుకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయన్నారు. కేసీఆర్‌ సమున్నత సంకల్పం.. జై కొడుతోంది.. జల హారతి పడుతోందని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మాత్రం.. మొక్కవోని దీక్షతో నిలబడిరదన్నారు. కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ.. ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ.. ఎప్పటికీ.. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ’మేటి’గడ్డ అన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే ’కల్పతరువు’ అని తెలిపారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి. కేసీఆర్‌ సర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్‌’ అంటూ ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. ఈ సందర్భంగా గోదావరిలో వరదకు సంబంధించిన వీడియోను సైతం జతం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి