క్రీడలతో శారీరక–మానసిక దృఢత్వం: కె. అనిల్ కుమార్ రెడ్డి

చెన్నై న్యూస్: క్రీడల ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణ ఆరోగ్యం, శారీరక మరియు మానసిక దృఢత్వం పెంపొందించుకోవచ్చని శ్రీ వేణుగోపాల విద్యాలయం ప్రెసిడెంట్ కె. అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. చెన్నై మాండవేలిలోని శ్రీ వేణుగోపాల విద్యాలయం 45వ వార్షిక క్రీడా సమారోహం శుక్రవారం ఉదయం చెన్నై ఎగ్మోర్‌లోని రాజారత్నం స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా 91వ చెస్ గ్రాండ్‌మాస్టర్ వి.ఎస్. రాహుల్ పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అనంతరం ముఖ్య అతిథి రాహుల్ మరియు నిర్వాహకులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాహుల్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, శాంతి పావురాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కె. అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే శారీరక–మానసిక దృఢత్వం పెంపొందడంతో పాటు ఉన్నత స్థాయిలకు చేరుకోవచ్చని తెలిపారు. పలు సూచనలు అందజేశారు. ముఖ్య అతిథి వి.ఎస్. రాహుల్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని చెప్పారు.

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా, కర్రసాము సాధన, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రెసిడెంట్ కె. ఆనంద్ కుమార్, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ వి. గోవింద్, ట్రెజరర్ కె. రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్. ఇలాంగో, హెడ్‌మిస్ట్రెస్ వి. శీలా తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి