డి.ఎం.కె. గెలుపు కోసం తమిళనాడు తెలుగు యువశక్తి విస్తృత ప్రచారం

చెన్నై న్యూస్:గత ఐదేళ్లలో “ద్రావిడ మోడల్” పేరుతో డీఎంకే ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించి, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. ఈ పాలన కొనసాగాలని కోరుతూ, తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజలందరూ డీఎంకేకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
రాబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ద్రావిడ మోడల్ పాలన కొనసాగింపునకు డీఎంకే కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతు కృషి చేస్తున్నామని చెప్పారు. హోసూరు, తాళి, సేలం, మధురై, కోయంబత్తూర్, చెన్నై వంటి ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి తెలుగు అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తాను ముఖ్యంగా తాళి, హోసూరు ప్రాంతాల్లో తెలుగు అభ్యర్థుల గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నానని తెలిపారు. అలాగే, సేలం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని తెలుగు ప్రజల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
గతంలో స్టాలిన్ ప్రభుత్వ పాలనకు గుర్తుగా పుల్లపురంలో మహిళలకు చీరల పంపిణీ చేయడం, ఎంపీ ఎన్నికల్లో 40 స్థానాల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ తిరుత్తణిలో బంగారు రథాన్ని లాగడం, శ్రీశైలం లో పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ శ్రేయస్సు కోసం తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఘన స్వాగత కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు తెలిపారు. 2021 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే విజయానికి తమ సంస్థ కృషి చేసిందని గుర్తు చేశారు.
డీఎంకే పాలనపై కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి స్వయంగా అచ్చతెలుగులో పాటలు రచించడం విశేషం. ఆయన రచించిన పాటల్లో గత ఐదేళ్ల పాలన విజయాలను ప్రతిబింబించారు.

పాటల నుంచి కొన్ని పంక్తులు:
1) “జైయీ భవ – దళపతి రావడం!”
జైయీ భవ… విజయీ భవ… 🔥
సూర్య కాంతితో వెలిగే నాయకుడు వస్తున్నాడు… ☀️
తమిళ నేల గర్వం… దళపతి వచ్చాడు…

2) “వచ్చాడయ్య స్వామి… దళపతి వచ్చాడయ్య!” 🔥
వచ్చాడయ్య స్వామి… ప్రజల మధ్యకు వచ్చాడయ్య!
నాయకుడు… నాయకుడు… దళపతి నాయకుడు!
ఉదయ సూర్యుడిలా ఉదయించాడు ☀️
చీకట్లు చెరిపే శక్తిగా నిలిచాడు!
ఇప్పటికే రెండు తెలుగు, రెండు తమిళ పాటలను విడుదల చేసిన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి సినీ నిర్మాత, దర్శకుడిగా కూడా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే.
రేపు సేలం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. అనంతరం సేలం, మధురై, కృష్ణగిరి, వెల్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, తిరువల్లూరు జిల్లాలతో పాటు చెన్నై నగరంలో కూడా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

………………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి