విల్లివాకం న్యూస్: చెన్నై, పెరంబూర్, పటేల్ రోడ్డులో గల శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర ఆదివారం ఆనంద నిలయం నుంచి ప్రారంభమయింది. 47వ సంవత్సరంగా ఏర్పాటైన ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జంబు పాల్గొని ప్రారంభించారు. ప్రత్యేక అతిథులుగా పుదుచ్చేరి ఎమ్మెల్యే శివశంకర్, పారిశ్రామికవేత్త కిల్లి వళవన్ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర రెడ్ హిల్స్, పెరియపాలయం, ఊత్తుకోట, సురుటుపల్లి నాగలాపురం, నారాయణవనం, పుత్తూరు, తిరుచానూరు మీదుగా సాగి తిరుమల 17వ తేదీ ఉదయానికి చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, సహకార్యదర్శి హెచ్ అనంతరామన్, కోశాధికారి పి కోదండరామన్, ట్రస్టీ పి రామచంద్రన్ సహా దాదాపు మహిళలు, పురుషులు 300 మంది పాల్గొన్నారు. అలాగే పాండిచ్చేరికి చెందిన భక్తులు పదిమంది పాల్గొన్నారు.
One Response
Good