గాంధీనగర్ ఈసిఐ బెరాక తెలుగు చర్చిలో ప్రత్యేక ఆరాధన

విల్లివాకం న్యూస్ : ఈసిఐ, గాంధీనగర్ తెలుగు చర్చిలో ఆదివారం సిస్టర్ ఫెయిత్ (సింగపూర్) తన సాక్షాన్ని పంచుకున్నారు. డాక్టర్ నీల సువర్ణ హగ్గయి 2:5 ఆధారంగా దైవ సందేశాన్ని వినిపించారు. అలాగే, ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ ఎబెల్ నీలకంఠన్ ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను చర్చి తరఫున సత్కరించారు.

గత ఏడాది స్త్రీల సమాజం కమిటీ తరపున సంఘములోని ప్రతి కుటుంబానికి బహుమతులను అందజేశారు. అలాగే నూతన స్త్రీల సమాజ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రత్యేక ఆరాధనలో దేశ క్షేమం, కుటుంబాల ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఓ తిమోతి, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి