ఒడిషా నైనీలో సింగరేణి తవ్వకాలు

తవ్వకాలకు సహకరించాలని భట్టి వినతి

సిఎం మోహన్‌ చరణ్‌ మాంజీతో భట్టి చర్చలు

పూర్తిగా సహకరిస్తామని హావిూ ఇచ్చిన సిఎం

ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలు చేపట్టేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాంజీని కోరారు. దీనిపై స్పందించిన ఒడిశా సీఎం నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తాని భరోసా ఇవ్వడంతో పాటు, తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నైనీ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరెందుకు శుక్రవారం భట్టి విక్రమార్క..అధికారుల బృందంతో కలిసి ఒడిశా సీఎంను శుక్రవారం ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఒడిశా ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి.. సింగరేణికి బొగ్గు బ్లాకుల 

ఆవశ్యకతను వివరించారు. 2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి తాడిచర్ల బ్లాక్‌, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని తెలిపారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండిరగ్‌లో ఉందని, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని చెప్పారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకు ఒడిశా సర్కార్‌కు ఆదాయం సమకూరుతుందని వివరించారు. దీంతో భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంగుల్‌ జిల్లాలోని సింగరేణికి కేటాయించిన నైనీ కోల్‌ బ్లాక్‌లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని భట్టి విక్రమార్క.. రాష్ట్ర అధికారుల బృందంతో ఒడిశా సీఎంతో ఆ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాంజీకి వివరించారు. 2017లోనే సింగరేణికి నైనీ గనులను కేటాయించారని.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. అప్పుడు అందజేసిన వినతిపత్రాలను అందజేశారు. తాడిచర్ల బ్లాక్‌, నైనీ బ్లాక్‌లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. నైనీ బ్లాక్‌లో తవ్వకాలు చేపట్టడం వల్ల ఒడిశా యువతకు అధిక సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో రూ.600 కోట్ల వరకూ ఒడిశా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని భట్టి.. ఒడిశా సీఎంకు వివరించారు. నైనీ బ్లాకులో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని చెప్పారు. అటవీ, ప్రైవేట్‌ భూములను సింగరేణికి బదలాయించాల్సిన అంశం పెండిరగ్‌లో ఉందని.. అది పరిష్కారమైతే సింగరేణి సంస్థ తవ్వకాలు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూముల బదలాయింపు, విద్యుత్‌, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడి ఉన్నతాధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు
dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి