ప్రముఖ గాయని పి సుశీలకు అస్వస్థత..

చెన్నై న్యూస్ :ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఆళ్వార్‌పేటలోనికావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం..
గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సుశీల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో శుక్రవారం రాత్రి వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిల్, కన్నడ, మళయాలం ఇలా అన్ని భాషల్లో రాణించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్​లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Spread the love

2 Responses

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి