చెన్నై చేరిన పవన్ కళ్యాణ్ – జమిలి ఎన్నికలపై కీలక సదస్సు

చెన్నై న్యూస్:వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుకు దక్షిణ భారతంలో ప్రాధాన్యతగల చర్చకు చెన్నై వేదికైంది. బీజేపీ తమిళనాడు శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనను చెన్నై ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతించారు.

ఈ సదస్సులో బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, నయనార్ నాగేంద్రన్, అనిల్ ఆంటోనీ, అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్ర ప్రణాళికపై చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది.

ఇది అమలైతే 2027లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నట్లు అంచనా. గతంలో 1951-1967 మధ్య ఇది సాధ్యమైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే విధానం వైపు కేంద్రం అడుగులు వేస్తోంది.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి