
చెన్నై న్యూస్:వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలుకు దక్షిణ భారతంలో ప్రాధాన్యతగల చర్చకు చెన్నై వేదికైంది. బీజేపీ తమిళనాడు శాఖ ఏర్పాటు చేసిన ఈ సదస్సు తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనను చెన్నై ఎయిర్‌పోర్టులో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతించారు.
ఈ సదస్సులో బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, నయనార్ నాగేంద్రన్, అనిల్ ఆంటోనీ, అరవింద్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. జమిలి ఎన్నికలపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని స్థాయిల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న కేంద్ర ప్రణాళికపై చర్చించేందుకు కేంద్రం ఇప్పటికే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది.
ఇది అమలైతే 2027లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నట్లు అంచనా. గతంలో 1951-1967 మధ్య ఇది సాధ్యమైనప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే విధానం వైపు కేంద్రం అడుగులు వేస్తోంది.