ఎన్డీయేకి గుడ్‌బై చెప్పిన ఓ.పి. ఎస్ – స్టాలిన్‌తో చర్చలు, తమిళ రాజకీయాల్లో కొత్త ఉలికిపాటు

టీ నగర్ న్యూస్:తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలనం రేకెత్తింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం (ఓ.పి. ఎస్) ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రామచంద్రన్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రకటన సమయంలో ఓ.పి.எస్‌ కూడా అక్కడే ఉండటం, ఆయన వ్యక్తిగతంగా ఏ అంశాలపై స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సమీప కాలంలో ఓ.పి. ఎస్ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ సమయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయ భవిష్యత్తు దిశగా పలు అంశాలపై చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీయేతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించడం కీలక పరిణామంగా నిలిచింది.

ఇదిలా ఉండగా, ఇటీవల సినీనటుడు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగంతో ఓ.పి. ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓ.పి. ఎస్ “కాలమే చెబుతుంది” అనే సమాధానంతో సర్దేశారు.

ఓ.పి. ఎస్ గతంలో ఏఐఏడీఎంకేలో కీలక నాయకుడిగా వ్యవహరించగా, పార్టీ అంతర్గత గొడవల వల్ల ఆయన బహిష్కరణకు గురయ్యారు. అనంతరం స్వతంత్రంగా తన వర్గాన్ని నిర్మించుకున్న ఆయన, ఇప్పుడు ఎన్డీయే నుంచి కూడా బయటకు రావడం.. 2026 అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

………

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి