ఎపి అసెంబ్లీలో ఆసక్తికర ఘటన

జగన్‌తో ఎమ్మెల్యే రఘురామ భేటీ

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌, తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య సంభాషణ జరిగింది. సమావేశాలు జరిగినన్ని రోజులూ సభకు రావాలని జగన్‌ను రఘురామ కోరగా.. హాజరవుతానని ఆయన బదులిచ్చారు. వాళ్లిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో వైకాపా ఎంపీగా ఉంటూనే రఘురామ అప్పటి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వైకాపా ప్రభుత్వం, జగన్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. ఈ క్రమంలో రఘురామ అరెస్ట్‌ తదితర పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో జగన్‌, రఘురామ ఏం మాట్లాడుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్‌ను ఆయన ఛాంబర్‌లో భాజపా ఎమ్మెల్యేలు కలిశారు. చాలా మంది వైకాపా నేతలు భాజపా వైపు చూస్తున్నారనే అంశంపై వారి మధ్య కాసేపు చర్చ జరిగింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అలాంటిది ఏదైనా ఉంటే ఉమ్మడిగా నిర్ణయిద్దామని చెప్పారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి