శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

విళ్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు’ గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి. దీనికి చెన్నై కొరట్టూరు అగ్రహారం లో గల శ్రీ కోదండ రామాలయం కమ్యూనిటీ హాల్ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు ఎట్టయపురం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చాన్సులర్ వి రామచంద్రన్ విచ్చేశారు. విశిష్ట అతిధులుగా ఆదర్శ్ షిప్పింగ్ అండ్ సర్వీసెస్ డైరెక్టర్ డి దేవేంద్రన్, పిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పి ముత్తువేల్ రాజ్, ఇకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభారాజా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫోక్ డాన్స్ మ్యూజిక్ అండ్ వెల్కమ్ డాన్స్, శ్రీ వెంకటేశ్వర ప్రైమరీ విద్యాలయం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 10 వ తరగతి , 12వ తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జేయం నాయుడు, ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరినాథ్, ఉపాధ్యక్షురాలు పి సరస్వతి, ఉపాధ్యక్షులు కేఎన్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260319-WA0255
ఘనంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం 'ఉగాది స్వర్ణోత్సవ సంబరాలు'
IMG-20260319-WA0227
శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
IMG_20260319_170816
పుళల్ కావంగరై తెలుగు ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
IMG-20260319-WA0089
పరాభవ సంవత్సరం భయమా? అసలు అర్థం ఇదే!
IMG_20260318_220750
తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక వెబ్సైట్, ఈ పేపర్ ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి