విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. రేపే సీఎంగా ప్రమాణస్వీకారం

చెన్నై న్యూస్ : తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అధికారికంగా అనుమతి ఇవ్వడంతో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
విజయ్‌కు ఇప్పటికే సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీల మద్దతు లభించింది. ఎడమపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకేకు అసెంబ్లీలో పూర్తి మెజార్టీ దక్కింది.
అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ 5 మంది సభ్యుల మద్దతు ప్రకటించింది. అదనంగా సీపీఎం-2, సీపీఐ-2, వీసీకే-2, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)-2 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు. దీంతో విజయ్‌కు మద్దతుగా మొత్తం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు గవర్నర్‌కు సమాచారం అందించారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు కూడా చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి