చెన్నై న్యూస్: చెన్నై గణేష్ పురం ఈసీఐ చర్చ్ 41వ వార్షికోత్సవ వేడుకలు మంగళ వారం రాత్రి ఎంతో ఘనంగా జరిగాయి.ఈ సభ ఈసీఐ సౌత్ఆంధ్ర డయాసిస్, ఆల్ ఇండియా రెండవ వైస్ ప్రెసిడెంట్ గారైన బిషప్ ఏబేల్ నీలకంఠ గారి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డి. బాలరాజు ప్రారంభ ప్రార్థన చేసి అతిథులను గౌరవించారు. అనంతరం తెలుగు మద్రాస్ ఏరియా చైర్మన్ రెవరెండ్ సురేష్ బాబు గారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మధిర ఈసీఐ ఏరియా చైర్మన్ రెవరెండ్ మల్లికార్జున రావు పాల్గొని దైవ వాక్యాన్ని బోధించారు. అలాగే తను రక్షణ పొందిన విధానాన్ని సాక్ష్యంగా పంచుకున్నారు. ముందుగా స్థానిక సంఘ స్త్రీల సమాజం, యవ్వనస్తులు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా అతిధుల ను సంఘం తరఫున శాలువలతో సత్కరించారు.
బిషప్ ఆర్కే ఏబెల్ నీలకంఠ గారు సంఘస్థాపన, అభివృద్ధి తదితర విషయాలను గూర్చి వివరించారు. బిషప్ కమీషనరీ లు డాక్టర్ కె.ఆర్ ప్రసాద్ ప్రార్ధన చేయగా, రెవరెండ్ డి సురేష్ నాథ్ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈసీఐ సౌత్ఆంధ్ర డయాసిస్ ట్రెజరర్ రెవరెండ్ వి. యోహాను పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లల ను సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యవ్వనస్తులు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలు దేవునికి మహిమ కరంగా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జరిగింది. అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు.
………..