ఘనంగా డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు జన్మదిన వేడుకలు

విల్లివాకం న్యూస్: టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు జన్మదిన వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. జనో అలూమ్ని స్టూడెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చెన్నై పెరియమేట్ లోని సాల్వేషన్ ఆర్మీ హెచ్ఆర్ డి సెంటర్ వేదికయింది. ముఖ్య అతిథులుగా బిషప్ దైవ ప్రసన్న, డాక్టర్ ప్రకాష్ రాజ్, డాక్టర్ దయాపాత్ర, రెవ. ఏసుపాదం విచ్చేశారు. అలాగే, గుడిమెట్ల చెన్నయ్య తో పాటు టామ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.దేవదానం, ఎస్ జయపాల్, పాల్ కొండయ్య, వి ఇశ్రాయేలు, ఏ యెషయా, ట్రెజరర్ బి ఎన్ బాలాజీ, హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ సి తిరుమలరావు, మస్తాన్, యెహెఙ్కేలు, ఆర్ జయరాజ్, పెంచలయ్య లీగల్ అడ్వైజర్ జిసి నాగూర్, బలభద్ర దేవరాజ్, ఎస్ కె ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

గొల్లపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ టామ్స్, జనోదయం నుంచి విశేష సేవలందిస్తున్నామని, మన పిల్లలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం లయోలా విద్యార్థులు నరేష్, జస్టిన్ ప్రసంగించారు. టోనీ ప్రకాష్ క్రైస్తవ భక్తి గీతాన్ని వినిపించారు. రెవరెండ్ ఏసుపాదం మాట్లాడుతూ గొల్లపల్లి ఇశ్రాయేలు ఎందరి జీవితాలను వెలిగిస్తున్నారని, ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని అభిలషించారు.

ఫిబ్రవరి 22న వైఎంసిఏ, నందనంలో జరిగే కేఏ పాల్ బహిరంగ సభకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇందులో బిషప్ దైవ ప్రసన్న మాట్లాడుతూ దళిత సమాజ ఆశా కిరణం, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం గొల్లపల్లి ఇశ్రాయేలు అని తెలిపారు. ఆయన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. డాక్టర్ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తమ చర్చ్ తరపున టామ్స్ కు ప్రతి ఏడాది రూ.25 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు. డాక్టర్ దయాపాత్ర, గుడిమెట్ల చెన్నయ్య, రంగనాథన్, పిసి నాగూర్, దేవదానం, సీనియర్ లాయర్ శ్రీనివాసులు, పాలకొండయ్య తదితరులు ప్రసంగించారు. పాస్టర్ దేవదాస్ ప్రార్ధన చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. చివరిగా గొల్లపల్లి ఇశ్రాయేలు వందన సమర్పణ చేశారు.

………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి