జులై ఒకటో తేదీన ఇంటి వద్దకే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ

పింఛన్లు

       జులై ఒకటో తేదీన ఇంటి వద్దకే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్ర బిసి,ఇడబ్ల్యుఎస్,చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా పెనుగొండ నియోజకవర్గానికి వచ్చిన సవితమ్మకు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఆదివారం బెంగళూరు విమానాశ్రయం నుండి వయా సోమందేపల్లి, పెనుగొండ పట్టణము వరకు ప్రజలు మంత్రివర్యులకుఆడుగడు గునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 6 గంటల పాటు ర్యాలీ కొనసాగింది. పెనుగొండ పట్టణం సమీపంలో వైశాలి అతిథిగృహమునందు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూఎన్డీఏ కూటమి వలన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంటుందిరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు తెదేపా అధికారంతో చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏతో భాగ స్వామ్య ప్రభుత్వాలు ఉండ టంతో సీఎం చంద్రబాబు ఇందుకు కృషి చేస్తే చేనేత బతుకుల్లో అభివృద్ధి వెలుగులు విరజిల్లుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో తెదేపా అమలు. చేసిన సంక్షేమ, రాయితీ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నాకు ఇచ్చిన బీసీ సంక్షేమం, చేనేత జౌళిశాఖ మంత్రి పదవులు ఇచ్చారని . అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందజేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేస్తానని తెలిపారు. ఇంతటి ప్రజాధరణ ఇచ్చిన ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని తెలిపారు త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 
             రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేయడం జరిగిందని ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పధకాలపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని,ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు. అదే విధంగా 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించ నున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు.ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు,హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారురాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి ఏడు వేల రూపాయలు సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ కార్యక్రమం, ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి