వైసీపీ కార్యాలయాల కూల్చివేత ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది

     రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలుచోట్ల వైసీపీ కార్యాలయాలను అధికారులు కూల్చివేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీస్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు.దీ నిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయాలను కూల్చడం, నోటీసులు ఇవ్వడంపై వైసీపీ హై కోర్టును ఆశ్రయించింది. వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 10 జిల్లా కార్యాలయాలకు సంబంధించిన కూల్చివేతలు, నోటీసులు గురించి వైసీపీ పెటిషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ కార్యాలయాల కూల్చి వేతలకు ప్రభుత్వం సిద్ధమైందని ఆ పార్టీ తరుపు లాయర్ వాదించారు.తా ను ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్నా తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తామని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు ఇప్పటికిప్పుడు వైసీపీ కార్యాలయాలు కూల్చివేయడం లేదని, అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని పేర్కొన్నారు ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి