ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి ఆరోపణలు: మాజీ మంత్రి ఆర్కే రోజా పై సీఐడీ దర్యాప్తు

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి ఆర్కే రోజా పై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్’ వంటి క్రీడా కార్యక్రమాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం సుమారు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, కొనుగోలు చేసిన క్రీడా సామగ్రి నాణ్యతలో లోపాలు ఉన్నాయని, నాసిరకం సామగ్రిని కొనుగోలు చేసి డబ్బులు దండుకున్నారనే ఫిర్యాదులు అందాయి.

ఈ ఆరోపణలపై సీరియస్ గా స్పందించిన కూటమి ప్రభుత్వం, సీఐడీ ద్వారా దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారులు వివిధ అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు ఫలితాలపై ఆధారపడి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ పరిణామాలు మాజీ మంత్రి ఆర్కే రోజాకు రాజకీయంగా పెద్ద షాక్ గా భావించబడుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి