గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు 

ఐదురోజుల పాటు సమావేశాల నిర్వహణ

బిఎసి సమావేశంలో నిర్ణయం

సమావేశానికి వైకాపా గైర్హాజరు

గవర్నర్‌ను రాచమార్గంలో రప్పించామన్న స్పీకర్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడిరది. అనంతరం స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం పూర్తయింది. ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, విష్ణు కుమార్‌ రాజు హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా సభలో శ్వేత పత్రాలను విడుదల చేసేలా అధికార పక్షం ప్రతిపాదించింది. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హాజరు అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ… ఈ 

సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్‌`2 తలుపులు తీశామని తెలిపారు. నలుగురు ప్యానల్‌ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయన్నారు. రెండుబిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయాని కి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనుందని తెలిపారు. 88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయ్యాని అన్నారు. ఆరు నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడిరచారు. కాగా.. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఉయయసభలను ఉద్దేశించిన గవర్నర్‌ నజీర్‌ ప్రసంగించారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260729-WA0009
సమాజాన్ని సంస్కరించేది గురువులే
maalai-malar_2026-07-28_39orq3nf_tn-10
నటి పావలా శ్యామల కన్నుమూత
supreme-court-2025-08-21-07-02-32
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు స్పష్టం
IMG_20260725_063602
విద్యే విజయానికి పునాది: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు అవసరం
dailythanthi_2026-07-22_nej8eppv_10
జననాయగన్' టికెట్ వివాదం.. ₹200 టికెట్‌కు ₹700 వసూలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి