తెలుగు కుర్రోడు నితీష్ కు చోటు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఢిల్లీ ప్రతినిధి :బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో జరిగిన జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు నితీశ్ ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జింబాబ్వేకు బయలుదేరకముందే జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్‌కు విశ్రాంతి ఇచ్చారు. టీమిండియాలో తిరిగి చోటు దక్కుతుందనుకున్న ఇషాన్ కిషన్‌కు నిరాశే ఎదురైంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్‌, అవేశ్ ఖాన్‌లను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

అక్టోబర్ 6 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి