విరాట్‌ కోహ్లీ పబ్‌పై కేసు నమోదు!

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి చెందిన ‘వన్‌8 కమ్యూన్‌’ పబ్‌పై కేసు నమోదైంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహించినందుకు గాను బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి 1.30 గంటల వరకు తెరిచి ఉన్నందుకు బెంగళూరులోని వన్‌8 కమ్యూన్‌ మేనేజర్‌పై కేసు నమోదైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో విరాట్‌ కోహ్లీకి చెందిన వన్‌8 కమ్యూన్‌తో పాటు మరికొన్ని పబ్‌లు నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్‌ల నంచి పెద్దశబ్దంతో సంగీతం వినిపిస్తోందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దాంతో రైడ్‌ చేసిన పోలీసులు.. పబ్‌ల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకే పబ్‌లకు అనుమతి ఉంది. బెంగళూరుతో పాటుగా ఢల్లీి, ముంబై, పుణె, కోల్‌కతాలో వన్‌8 కమ్యూన్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. బెంగళూరు పబ్‌ను 2023 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఇది రత్నం కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఉంది. కస్తూర్బా రోడ్డులో ఉన్న ఈ పబ్‌ నుంచి కబ్బన్‌ పార్క్‌, చిన్నస్వామి స్టేడియంలను చూడొచ్చట. ఇక టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం విరాట్‌ కోహ్లీ లండన్‌ వెళ్లాడు. తన భార్య, పిల్లలను కలవడానికి వెళ్లాడు. చాలా వారాలు విరాట్‌ అక్కడే ఉండనున్నాడు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి