ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డ్‌ రేసులో రోహిత్‌కు షాకిచ్చిన బుమ్రా

జూన్‌ 29న టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ విజయంలో ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో బూమ్‌ బూమ్‌ బుమ్రాకు ఐసీసీ నుంచి అద్భుతమైన రిటర్న గిఫ్ట్‌ దక్కింది. బుమ్రా జూన్‌ 2024 కోసం ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు కోసం బుమ్రా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్‌లతో పోటీ పడ్డాడు. వీరిద్దరిని అధిగమించిన బుమ్రా ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 30 ఏళ్ల టీమిండియా పేసర్‌.. %ఖూA%, కరేబియన్‌లలో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టి, 4.17 ఎకానమీ రేటుతో అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పురుషుల %ు%20 ప్రపంచ కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డులో విరాట్‌ కోహ్లీ (రెండుసార్లు విజేత)తో కలిసి భారత ఆటగాడిగా చేరాడు. ‘‘జూన్‌ నెలలో %Iజజ% పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను. %ఖూA%, వెస్టిండీస్‌లో గడిపిన కొన్ని వారాల చిరస్మరణీయమైన రోజుల తర్వాత ఇది నాకు ప్రత్యేక గౌరవం. టోర్నమెంట్‌లో మేం బాగా ఆడడం, చివర్లో ట్రోఫీని ఎత్తడం చాలా ప్రత్యేకమైనది, నేను ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన జూన్‌ నెలకుగానూ ఐసీసీ ఉమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మైయా బౌచియర్‌, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను ఓడిరచిన, లేడీ విరాట్‌ అంతర్జాతీయ కెరీర్‌లో మొదటిసారి ఈ అవార్డును దక్కించుకుంది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం