రెండు కళ్లయితే సాగర్‌, శ్రీశైలంలపై ఎందుకు చర్చించలే

చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు

గుంటూరు,జూలై8(ఇది నిజం): ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్టాల్రు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్టాల్రు రెండు కళ్లు అంటే అర్థమేంటని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు అంగీకరించినట్లేనా అని చంద్రబాబును నిలదీశారు. బాబు మాటలు చూస్తుంటే ఏపీకి ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు చర్చించలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఏపీలోని పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీ బోర్డు, ఆదాయంలోనూ వాటా కోసం తెలంగాణ పట్టుబట్టిందని అన్నారు. తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇద్దరు తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రుల భేటీపై వచ్చిన వార్తలు నిజమేనా అని నిలదీశారు. సమాధానం చెప్పకుండా ఎందుకు 

తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ డిమాండ్లకు బాబు అంగీకరించినట్లేనా అని అన్నారు. మౌనం అర్దాంగీకారం అనుకోవాల్సి వస్తోందని చెప్పారు. విభజన అంశాలపై చర్చను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏపీ సీఎంగా ఉండి రెండు రాష్టాల్రు సమానం అని అంటారా? అని మండిపడ్డారు. ఏపీకి చంద్రబాబు ఏదో ద్రోహం తలపెట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. పార్టీ పరంగా బాబుకు రెండు రాష్టాల్రు రెండు కళ్లు కావచ్చు.. ఏపీ ప్రభుత్వపరంగా చంద్రబాబు వైఖరేంటో చెప్పాలి. నాగార్జునసాగర్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. దాని విూద చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అంబటి రాంబాబు అన్నారు. విభజన జరిగాక పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. చంద్రబాబు తప్పు చేసినందుకే మెడ పట్టుకుని గెంటేశారని విమర్శించారు. రాష్టాన్రికి రావాల్సినవి ఏవీ తీసుకురాకుండా ఎందుకు పారిపోయి వచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఏపీకి అన్యాయం చేశారని తెలిపారు. ఇప్పుడు కూడా మరోసారి తెలంగాణకు ద్రోహం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి