అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి

చెన్నై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురైంది. పుణే జిల్లాలోని బారామతి ప్రాంతంలో ఉదయం 8:45 గంటల సమయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.
విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన భద్రతా సిబ్బంది సహా మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. విమానం కూలిన అనంతరం అజిత్ పవార్‌ను సహాయక బృందాలు బయటకు తీసి ఆసుపత్రికి తరలించినట్లు తొలుత సమాచారం వెలువడింది.
అయితే, ఈ ఘటనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం