అపరిశుభ్రమైన త్రాగునీటినే తాగుతున్నాం – హాస్టల్‌ విద్యార్థులు ఆవేదన

అమలాపురం, జూన్‌ 29 : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నడిబొడ్డు వడ్డిగబడెంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నేటికీ అపరిశుభ్రమైన మంచినీటిని తాగుతున్న హాస్టల్‌ విద్యార్థుల దుస్థితిని అధికారి యంత్రాంగం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరావు అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల అధ్యయనం కోసం శనివారం అమలాపురంలోని బాలికల వసతి గృహాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది.ఈ సందర్భంగా అక్కడున్న సమస్యలను అధ్యయనం చేయడం విద్యార్దుల నుండి అడిగి తెలులుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా హాస్టల్లో ఆర్వో ప్లాంట్‌ పనిచేయడం లేదని విద్యార్థులు వాపోయారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అపరిశుభ్రంగా ఉన్న త్రాగునీటిని తాగుతున్నామని, బయట ఉన్న సంపులోకి మున్సిపల్‌ వాటర్‌ వస్తుందని, ఆ వాటర్‌ని నేరుగా మోటార్‌ ద్వారా విద్యార్థులు తాగేందుకు టాప్‌ల ఏర్పాటు చేశారని వాటినే తాగుతున్నామన్నారు. అవి కూడా సరిపడా రావడం లేదని విద్యార్థులు తమ వద్ద వాపోయార అన్నారు. బయట ఉన్న సంపుకి ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు లేవని చుట్టూ మట్టి గడ్డి పేరుకు పోయాయని పాములు ఇతర విష జీవులు లాంటివి సంపులోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే 350 మంది విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్‌ నందు టాయిలెట్స్‌ అపరిశుభ్రంగా ఉంటున్నాయని, అలాగే ఆరుబయట హస్టర్‌ చుట్టూ పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయిని, పాములు, పురుగులు, దోమలు విపరీతంగా పెరిగాయని చాలా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని ఈ సందర్భంగా విద్యార్థులు సిపిఎం పార్టీ బృందంకు తెలిపారు. తక్షణం ఈ హాస్టల్ని ఉన్నతాధికారులు సందర్శించి సమస్యలు పరిష్కారానికి చేయాలని ఈ సందర్భంగా  సిపిఎం బృందం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌ వద్ద నుంచే సంబంధిత ఎఎస్‌డబ్ల్యుఓతో సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు ఫోన్లో మాట్లాడడం జరిగిందని, పెద్ద హాస్టల్‌ దగ్గర వీటిని శుభ్రం చేయడానికి నిధులు లేవని శనివారం సమావేశం జరిగిందని ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యలు వివరించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమస్యలు పరిష్కారం చేయాలని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని ఈ సందర్భంగా ఆయన అధికారులు హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఎం నాయకులు పొలమూరు శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కే.శంకర్‌ కుమార్‌ తదితరులున్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి