రామనగర్ గ్రామ పెద్దలకు సన్మానం

చెన్నై న్యూస్:నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నై ట్రిప్లికేన్ రామనగర్‌లోని సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.
రామనగర్‌కు చెందిన కప్పల పకీర్ దాస్ గతంలో అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్ కోసం టామ్స్ నాయకులతో కలిసి పోరాడారు. అలాగే రామనగర్ గ్రామపంచాయతీలో పలు పదవులు నిర్వహిస్తూ విశేష సేవలు అందించారు. గతం లోఆయనకు టామ్స్ ఫౌండర్ డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయిల్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టామ్స్, మాస్ ఉపాధ్యక్షుడు పల్లిపాటి పాలకొండయ్య, వై.ఎస్. శ్రీరాములు, దీనదయాలన్, అమావాస్య, డి. నరసింహులు, హేమవతి, వి. శశి తదితరులు శాలువాతో ఘనంగా గౌరవించారు.
అలాగే మాజీ రైల్వే ఉద్యోగి యల్లంటి సుందర రాజన్‌ను కూడా సన్మానించారు. ఆయన రామనగర్ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో గ్రామానికి అవసరమైన ఇంటి పట్టాలు, మౌలిక సదుపాయాల కోసం విశేషంగా కృషి చేశారు.
సంక్రాంతి సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

 

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం