చెన్నై న్యూస్:నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా చెన్నై ట్రిప్లికేన్ రామనగర్‌లోని సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.
రామనగర్‌కు చెందిన కప్పల పకీర్ దాస్ గతంలో అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్ కోసం టామ్స్ నాయకులతో కలిసి పోరాడారు. అలాగే రామనగర్ గ్రామపంచాయతీలో పలు పదవులు నిర్వహిస్తూ విశేష సేవలు అందించారు. గతం లోఆయనకు టామ్స్ ఫౌండర్ డాక్టర్ గొల్లపల్లి ఇజ్రాయిల్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టామ్స్, మాస్ ఉపాధ్యక్షుడు పల్లిపాటి పాలకొండయ్య, వై.ఎస్. శ్రీరాములు, దీనదయాలన్, అమావాస్య, డి. నరసింహులు, హేమవతి, వి. శశి తదితరులు శాలువాతో ఘనంగా గౌరవించారు.
అలాగే మాజీ రైల్వే ఉద్యోగి యల్లంటి సుందర రాజన్‌ను కూడా సన్మానించారు. ఆయన రామనగర్ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో గ్రామానికి అవసరమైన ఇంటి పట్టాలు, మౌలిక సదుపాయాల కోసం విశేషంగా కృషి చేశారు.
సంక్రాంతి సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తమ అనుభవాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com