అనంత ఆధ్యాత్మికం ‘‘విష్ణుసహస్రనామం’’

కాకినాడ, జూన్‌ 29 : మహాభాగవతులు, ఆళ్వారులు, వాగ్గేయకారులు పారాయణ చేసిన విష్ణుసహస్రం శాంతి సంపద కలిగించే అనంత ఆధ్యాత్మిక స్తోత్రమని భోగిగణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం సుప్రభాత వేళ 38వ శ్రీవారి సంకీర్తనలో విష్ణు పారాయణ నిర్వహించారు. మహాభారత అనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు నామాలు అనంత ఆధ్యాత్మికమని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గణపతి వేంకటేశ్వర విగ్రహా మూర్తులకు  క్షీరాభిషేకం, దధ్యాభిషేకం, ఆజ్యాభిషేకం, మధుఅభిషేకం, శర్కరాభిషేకం చేశారు. శ్రీవారి భక్తులకు పసుపు కుంకుమ, రవిక, గాజులు ప్రదానం చేసారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి