కాకినాడ, జూన్ 29 : మహాభాగవతులు, ఆళ్వారులు, వాగ్గేయకారులు పారాయణ చేసిన విష్ణుసహస్రం శాంతి సంపద కలిగించే అనంత ఆధ్యాత్మిక స్తోత్రమని భోగిగణపతి పీఠం పేర్కొంది. శనివారం ఉదయం సుప్రభాత వేళ 38వ శ్రీవారి సంకీర్తనలో విష్ణు పారాయణ నిర్వహించారు. మహాభారత అనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు నామాలు అనంత ఆధ్యాత్మికమని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. గణపతి వేంకటేశ్వర విగ్రహా మూర్తులకు క్షీరాభిషేకం, దధ్యాభిషేకం, ఆజ్యాభిషేకం, మధుఅభిషేకం, శర్కరాభిషేకం చేశారు. శ్రీవారి భక్తులకు పసుపు కుంకుమ, రవిక, గాజులు ప్రదానం చేసారు.