చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దని కోర్టు ఆదేశాలు..

కోడంబాకం న్యూస్ :టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన ఫొటోలు, బిరుదులు, వాయిస్‌, చిత్రాలను వాడుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్‌.శశిధర్‌ రెడ్డి ఇంటెరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇకపై చిరంజీవి పేరు, ఫొటో, బిరుదులు, వాయిస్‌, చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేశారు. తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కు వాయిదా వేసింది. తాజాగా కోర్టు నిర్ణయంతో మెగాస్టార్‌ చిరంజీవి పేరును, ఇమేజ్‌, వాయిస్‌, ఫొటోలను అనధికారికంగా వాడటం లేదా ఏఐ సాంకేతికతను వినియోగించి సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొంది.

అనేక కంపెనీలు, సంస్థలు, సామాజిక మాధ్యమ ఖాతాలు.. చిరంజీవి అనుమతి తీసుకోకుండా ఆయన చిత్రాలను, ఏఐ సాంకేతికతతో సృష్టించిన చిత్రాలు, పోస్టర్లు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారని చిరంజీవి తరఫు న్యాయవాది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వివరించారు. వీటివల్ల చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న మెగాస్టార్‌, బాస్‌, అన్నయ్య, చిరు.. తదితర ట్యాగ్‌ లకూ ఇది వర్తిస్తుంది. అలాగే టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలి.
….

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి