మదనపల్లిలో బుద్ధుని శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులను అరెస్టు చేయాలి! …. ఎంపి తిరుమావలవన్

విల్లివాకం న్యూస్: అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న కొండపై బుద్ధుని శిలా విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివారం చెన్నై విసికే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్ తిరుమావలవన్ డిమాండ్ చేశారు. సుమారు 20 సంవత్సరాల నుండి మదనపల్లిలో బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ వీ.సీ.కే పార్టీ ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారని అతనిని రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది ఆ శిలా విగ్రహo తలను ధ్వంసం చేయడమే గాక ఈ చర్యను ప్రతిఘటిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన శివప్రసాద్ పై అనేక సెక్షన్లపై మదనపల్లి , రాయచోటి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తిరుమావలవన్ అన్నారు. బుద్ధుని తలను విధ్వంసం చేసిన శక్తులను అరెస్టు చేయాలని, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ అంతర్లీనంగా తెలుగుదేశం పార్టీ పై పెత్తనం చలాయిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఆగస్టు 23వ తేదీ విజయవాడలో విసికె పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్యకర్తలతో చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో తాను కూడా పాల్గొనబోతున్నట్టు తిరుమావలవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసింగం, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ వన్నియరసు, పిటిఎం శివప్రసాద్, యు. గణపతి తదితరులు పాల్గొన్నారు.

……………..

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

Screenshot_20260301_232356
సూపర్-8లో భారత్ ఘన విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ
IMG_20260223_182632
తమిళనాడు తుది ఓటర్ల జాబితా విడుదల
IMG-20260222-WA0115
రాగాలతోనే రోగాలకు చికిత్స – తెలుగు భాషను కాపాడితే మన సంస్కృతి నిలుస్తుంది: పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డి
IMG-20260221-WA0217
'జనని' ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
IMG-20260220-WA0102
చెన్నైలో ఘనంగా వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలు – తెలుగు ప్రజలకు ఆహ్వానం