పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

కేథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు, పోప్ ఫ్రాన్సిస్ (వయసు 88) ఈరోజు ఉదయం మరణించినట్టు వాటికన్ అధికారులు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వాటికన్ నగరంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.

ఈరోజు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఆయన మరణించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రకటనను కూడా వాటికన్ విడుదల చేసింది.

అర్జెంటీనాలో 1936 డిసెంబర్ 17న జన్మించిన జార్జ్ మారియో బెర్గొగ్లియో, 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. తన సేవా కాలంలో సానుభూతితో కూడిన నాయకత్వానికి, సామాజిక న్యాయం పట్ల గల నిబద్ధతకు ఆయన ప్రసిద్ధి చెందారు.

తాజాగా నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన తక్కువగా ఉన్నా, ఈ రోజు ఉదయం వచ్చిన వార్త ఆందోళనకరంగా మారింది. కేథలిక్ విశ్వాసులందరికీ ఇది ఒక శోక సంఘటనగా మారింది.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి