కేథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు, పోప్ ఫ్రాన్సిస్ (వయసు 88) ఈరోజు ఉదయం మరణించినట్టు వాటికన్ అధికారులు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, వాటికన్ నగరంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.
ఈరోజు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఆయన మరణించినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రకటనను కూడా వాటికన్ విడుదల చేసింది.
అర్జెంటీనాలో 1936 డిసెంబర్ 17న జన్మించిన జార్జ్ మారియో బెర్గొగ్లియో, 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. తన సేవా కాలంలో సానుభూతితో కూడిన నాయకత్వానికి, సామాజిక న్యాయం పట్ల గల నిబద్ధతకు ఆయన ప్రసిద్ధి చెందారు.
తాజాగా నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన తక్కువగా ఉన్నా, ఈ రోజు ఉదయం వచ్చిన వార్త ఆందోళనకరంగా మారింది. కేథలిక్ విశ్వాసులందరికీ ఇది ఒక శోక సంఘటనగా మారింది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com