మాగుంట కుటుంబంలో విషాదం

ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యురాలు దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అనారోగ్య కారణంగా ఈ రోజు ఉదయం గం. 06:15 లకు చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో లో చికిత్స పొందుతూ మరణించినారు… చెన్నై న్యూస్.

మాజీ పార్లమెంటు సభ్యులు , ప్రముఖ వ్యాపార వేత్త స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి సతీమణి , పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారి వదిన మాగుంట పార్వతమ్మ (77) సెప్టెంబర్ 25 తెల్లవారుఝామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఈ ఉదయం ఆమె కన్ను మూసారు.
పార్లమెంటు సభ్యురాలిగా , శాసన సభ్యురాలిగా పార్వతమ్మ పలు హోదాలలో ప్రజలకి తమ సేవలందించారు. మాగుంట సుబ్బరామరెడ్డి దివంగతులైన తరువాత 1996లో తొలిసారిగా ఆమె రాజకీయ రంగప్రవేశం చేసి లోక్ సభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆ తరువాత 2004లో ఆమె కావలి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు.
అంత్యక్రియలు :
ఆమె పార్థివ దేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకి నెల్లూరు , సరస్వతి నగర్ లోని ఆమె స్వగృహానికి తీసుకురానున్నారు.
అభిమానుల సందర్శనార్ధం రేపు అంటే సెప్టెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు.
గురువారం సాయంత్రం 3గంటలకి అక్కడి నుండి వారి అంతిమయాత్ర బయలుదేరుతుందని “మాగుంట కుటుంబసభ్యులు” తెలిపారు.
…………….

 

Spread the love

One Response

  1. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని
    తెలియజేస్తున్నాను.

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20260605-WA0099
అలరించిన యడవల్లి అరుణ శ్రీనాథ్ భక్తి గీతాలాపన
hindutamil-prod_2026-05-31_mbjedvkj_121242121
గుజరాత్‌పై ఘన విజయం.. వరుసగా రెండోసారి కిరీటాన్ని కాపాడుకున్న బెంగళూరు జట్టు
InShot_20260530_155745383
భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన
IMG-20260518-WA0128
చెన్నైలో ఘనంగా 'నిధి జ్యువెల్స్' ప్రారంభోత్సవం
IMG-20260516-WA0054
నీట్ అవకతవకలపై ప్రధానమంత్రి మోదీకి కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి లేఖ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి