
చెన్నై న్యూస్ :ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఆళ్వార్‌పేటలోనికావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం..
గత కొంతకాలంగా సుశీల తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. దీంతో సుశీల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలో శుక్రవారం రాత్రి వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుశీల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిల్, కన్నడ, మళయాలం ఇలా అన్ని భాషల్లో రాణించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
2 Responses
చాలా బాగుంది
NnAuXYtIrfkMRy