అమెజాన్ కొత్త ఏఐ.. చాట్‌జీపీటీ ప్రత్యర్థిగా మేటిస్

అమెజాన్

        టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దిగ్గజ కంపెనీలు చాట్‌బాట్‌లను లాంచ్ చేశాయి. ఇప్పటికే అత్యధిక ప్రజాదరణ పొందిన ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి.. గట్టి పోటీ ఇవ్వడానికి అమెజాన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ ‘మేటిస్’ (Metis) పేరుతో ఏఐ లాంచ్ చేయనుంది.

అమెజాన్ విడుదల చేయనున్న కొత్త మేటిస్ ఏఐ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైటాన్ ఏఐ మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుందని సమాచారం. మేటిస్ ఏఐ అనేది టెక్స్ట్, ఇమేజ్ బేస్డ్ సమాధానాలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఏఐ రేసులో అమెజాన్ కొంత వెనుకబడి ఉంది. అయితే అనుకున్న విధంగా సంస్థ (అమెజాన్) కొత్త మేటిస్ ఏఐ లాంచ్ చేసిన తరువాత.. ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అగ్రగాములుగా ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల సరసన చేరుతుందని పలువురు భావిస్తున్నారు. అమెజాన్ తన ‘మేటిస్ ఏఐ’ను 2024 సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ లాంచ్‍కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించ లేదు. అయితే కంపెనీ అలెక్సా ఈవెంట్‌లో అమెజాన్ మేటిస్ లాంచ్ చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

dailythanthi_2026-07-15_9tzloqpf_z5
"నేను ఒక కఠినమైన సమయాన్ని దాటి వచ్చాను" – భావోద్వేగంగా మాట్లాడిన యషికా ఆనంద్
IMG-20260712-WA0022
ముంబయిలో శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
maalai-malar_2026-07-11_r98fxj1m_SjanakiAmma001
గానకోకిల ఎస్. జానకి కన్నుమూత
InShot_20260704_081547026
ఎథనాల్ పెట్రోల్‌పై విచారణ కోరిన కేతిరెడ్డి
InShot_20260701_063008217
వైద్య వృత్తికి ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.సి. రాయ్.. వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా స్ఫూర్తిని చాటిన సందేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి