ఎపికి బడ్జెట్‌లో వరాల జల్లు

అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు

పోలవరం పూర్తికి బడ్జెట్‌లో హావిూ

కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏపీకి వరాల జల్లు కురిపించారు. రాష్టాన్రికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతికి భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, రైతులకు పోలవరం జీవనాడి అని.. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. అలాగే, హైదరాబాద్‌ ` బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం చేస్తాం. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడం సహా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.’ అని విత్త మంత్రి పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

రిలేటెడ్ ఆర్టికల్స్

n6623641441745996917202ff370ed97cd724a71703470da89fe6067cbb568d16f00ca532af199280d7eb3f
సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తీకరణ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహార ప్రకటనలు
IMG-20250429-WA0024
కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు ఘన నివాళి అర్పించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
IMG-20250426-WA0051
టిటిడిలో అలరించిన నృత్య ప్రదర్శనలు
IMG-20250426-WA0040
అన్ని భాషలను గౌరవించాలి : డాక్టర్ నిర్మల పళనివేల్
Screenshot_2025_0421_135813
పోప్ ఫ్రాన్సిస్ ఇకలేరు – వాటికన్ అధికారిక ప్రకటన

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి